17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

వచ్చే పుష్కరాలకి పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దాలి

26-02-2026 12:31 AM

అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం 

నిజామాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. వచ్చే ఏడాది 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని జిల్లాలోని ప్రధానమైన ఈ పుష్కరఘా ను క్షేత్రస్థాయిలో సందర్శించి, అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు.

పుష్కర ఘాట్ పరిసరాలు అపరి శుభ్రంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాల సమయంలోనే కాకుండా ఈ ప్రదేశానికి సాధారణ సమయాలలోనూ భక్తులు తరలివస్తారని, వారి సౌకర్యార్ధం పరిసరాల పరిశుభ్రతతో పాటు కనీస సదుపా యాలు భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

గోదావరి పుష్కరాలకు ఈ ఘాట్ వద్ద వీ.వీ.ఐ.పీలు, లక్షలాదిగా భక్తులు పుణ్య స్నానాలకు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారుల ను ఆదేశించారు. ముఖ్యంగా వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తులు బస చేసేందుకు వీలుగా తగిన వసతి, షామియానాలు వంటివి పక్కాగా అందుబాటులో ఉండాలన్నారు. భక్తులకు పూర్తి స్థాయిలో పటిష్ట భద్రత కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

భక్తు లు వంటలు చేసుకునేందుకు వీలుగా కిచెన్ షెడ్ నిర్మించాలని సూచించారు. పుష్కర ఘాట్ వద్ద మెట్లు, ఘాట్ వంటి వాటికి అవసరమైన మేర మరమ్మతులు చేయించాలని అన్నారు. ఘాట్ వద్ద ప్రమాదాలకు ఆస్కా రం లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని, హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని, రహదారికి మరమ్మతులు జరిపించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామారావు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.