12-12-2025 02:05:25 AM
తుంగతుర్తి, డిసెంబర్ 11: సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పలు మండలాల వ్యాప్తంగా ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళి ను గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు . ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ నరసింహ సమస్యాత్మక కేంద్రాలను పరిశీలించి, పోలీస్ ఇబ్బందులు మాట్లాడి, అదనపు సిబ్బంది ఏర్పాటు చేశారు. ఇరువురు అధికారులు శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరగాలని అధికారులకు సూచించారు.