12-12-2025 02:05:18 AM
రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, డిసెంబర్ 11 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, కరీంనగర్ వక్ఫ్ ప్రొటెక్షన్ కమిటీ వ్యవస్థాపక కార్యదర్శి అబ్దుల్ సమద్ నవాబ్ జీవితం ఈతరం కాంగ్రెస్ కార్యకర్తలకు ఆదర్శమని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సమద్ నవాబ్ ఇటీవలే హఠాన్మరణం చెందగా గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్సేనీపురాలోని మృతుడి నివాసంలో కుమారులు నవీద్, ఆహాద్, షాహిద్ ఆఫ్రిది తో పాటు ఆయన సోదరులను, వారి కుమారులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడు నవాబ్ అని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు. క్రమశిక్షణతో తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం సమద్ నవాబ్ అలుపెరుగని కృషి పోరాటం చేశారన్నారు. ఆయన మరణం తనను కలిసివేసిందన్నారు. పోరాట పటిమ, పట్టుదల కలిగిన నాయకుడిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఆకారపు భాస్కర్ రెడ్డి, మైనారిటీ సెల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్, సిటీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్‌ఎ మొహసీన్, రజిత రెడ్డి, లయిఖ్, నేహల్, సిరాజ్, శబాన, తదితరులుపాల్గొన్నారు.