calender_icon.png 13 December, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో గెలుపోటములు సహజం

13-12-2025 08:19:32 PM

మీ పోరాట పటిమ మెచ్చుకోదగ్గది

నీలం మధు ముదిరాజ్

స్వల్ప ఓట్లతో ఓడిపోయిన మంబాపూర్ సర్పంచ్ అభ్యర్థి నర్సింలుకు అండగా నీలం

పటాన్ చెరు: మెజారిటీ వార్డులలో గెలిచి ఎన్నికైన ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులను ఘనంగా సన్మానించి అభినందించిన నీలం మధు ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ఓటమి ఎదురైన కుంగిపోకుండా ప్రజల పక్షాన పని చేయాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ సూచించారు. శనివారం గుమ్మడిదల మండలం మంబాపూర్ పంచాయతీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన సర్పంచ్ అభ్యర్థి నర్సింలుతో పాటు విజయం సాధించిన ఉపసర్పంచ్, ఏడు మంది వార్డు మెంబర్లతో నర్సింలు నివాసంలో భేటీ అయ్యారు. మంబాపూర్ పంచాయతీలో మొత్తం ఎనిమిది వార్డులను కైవసం చేసుకున్నామని కానీ సర్పంచ్ అభ్యర్థి స్వల్ప తేడాతో పరాజయం చెందారని వివరించారు.

ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఎన్నికల్లో చివరి వరకు పోరాడి ప్రజల మన్ననలు పొందారని, మీ పోరాటం మెచ్చుకోదగ్గదని అభినందించారు. ఓటమితో కుంగిపోకుండా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు అందచేస్తూ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని  సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి నర్సింలు, ఉపసర్పంచ్ తో పాటు 7 మంది వార్డు సభ్యులకు సన్మానం చేసి అభినందించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కమ్మరి ప్రవీణఅశోక్ చారి, వార్డు సభ్యులు సంపంగి రవి, కొత్తపేట కృష్ణ, ఇతారి భాస్కర్, కొండని విజయ్, మల్లేపల్లి యాదమ్మ,రచమల్ల రాజు గౌడ్, కొండని లీలావతి, మాజీ సర్పంచ్ నర్సింలు, తలారి మేఘ రాజు,తిరుపతి, కంజర్ల మల్లేష్, నర్సింలు, హనుమత్, తదితరులు పాల్గొన్నారు.