20 March, 2026 | 1:32 PM

పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

26-05-2025 12:46 AM

మహబూబ్‌నగర్ రూరల్, మే 25: జిల్లా కేంద్రంలో చైతన్య హై స్కూల్ లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఆదివారం నిర్వహించిన గ్రామ పాలన అధికారి పరీక్ష ప్రశాం తంగా ముగిసింది.

పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో పరీక్ష జరుగుతున్న తీరును  పరిశీలించి, హాజరు వివరాలు తెలుసుకున్నారు. గ్రామ పాలన అధికారి  పరీక్షకు 152 మంది కి గాను 140 మంది అభ్యర్థులు హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు.కలెక్టర్ తో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు,అర్.డి. ఓ నవీన్,పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మహమ్మద్ అహ్మద్ తదితరులు ఉన్నారు.