28-10-2025 03:01:56 PM
- కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన విద్యను అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ (KUMAR DEEPAK) అన్నారు. మంగళ వారం నస్పూర్ లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు.
అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మధ్యాహ్నం భోజనంలో పౌష్టిక ఆహారాన్ని అందిస్తుందన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో ఆహారం, శుద్ధమైన తాగునీటిని అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ (SO) మౌనిక (MOUNIKA), అధ్యాపకులు తదితరులున్నారు.