28-10-2025 03:04:57 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీవో (RDO) కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ (KUMAR DEEPAK) సందర్శించారు. ఆర్డీవో శ్రీనివాస్ రావు (SRINIVAS RAO)తో కలిసి జాతీయ రహదారి (NATIONAL HIGHWAY) విస్తరణలో ఆర్బిట్రేషన్ (ARBITRATION)సంబంధిత రికార్డులను పరిశీలించారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రభావిత గ్రామాలలో అవార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేసి, ఆర్బిట్రేషన్ సంబంధిత రికార్డులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ సిబ్బంది తదితరులున్నారు.