28-10-2025 05:19:25 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కొనుగోలు కేంద్ర నిర్వాహకులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంతో పాటు ఉప్పల్వాయి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాతావరణ శాఖ సూచనల మేరకు తుపాను ప్రభావం వలన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఆన్ని వరి కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లను చేయాలని సూచించారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతులు నష్టపోకుండా, ధాన్యం తడవకుండా టార్ఫాలిన్ కవర్లతో పాటు అవసరమైన సౌకర్యాలు వెంటనే వేగవంతం చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.