05-07-2025 09:27:12 PM
కందుకూరు: కందుకూరు ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏర్పాటు కానున్న గ్రీన్ ఫార్మాలో లేఅవుట్ ద్వారా చేసిన ప్లాట్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం సాయంత్రం సంబంధిత రెవెన్యూ అధికారులతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రీన్ ఫార్మాలో భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు సోమవారం నుండి లక్కిరెడ్డి ద్వారా ఎంపిక చేసే కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని విషయంపై కలెక్టర్ ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ ఫార్మాలో భూములు కోల్పోయిన రైతులకు భూపరిహారం చెల్లించామని దానితోపాటు ప్రభుత్వం ఎకరానికి 121 గజాల స్థలాన్ని అదనంగా ప్లాట్ల రూపకంలో ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని కలెక్టర్ తెలియజేశారు. లక్కీ డీప్ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా పగడపుబందీగా చేపట్టాలని సంబంధిత ఆర్డీవోలకు, తహసీల్దారులకు ఆయన ఆదేశించారు.