calender_icon.png 6 July, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా రోడ్ల విస్తరణ చేపట్టాలి

05-07-2025 09:31:27 PM

మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ 

వనపర్తి టౌన్: జిల్లా కేంద్రంలోని 33వ వార్డు పెబ్బేర్ రోడ్ విస్తరణలో  పూర్తిగా ఆస్తి నష్టపోతున్న షాపుల యజమానులను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా విస్తరణ పనులను చేపట్టి వారికి న్యాయం చేయాలని మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వార్డ్ లో ఆక్రమణలకు గురైన స్థలాలను తొలగించి ప్రజలకు ఉపయోగపడే విధంగా రోడ్ల విస్తరణకు ఉపయోగించుకునే విధంగా చేస్తే పూర్తిగా ఆస్తి నష్టపోతున్న యజమానులకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు.

కొందరి లాభం కోసం ప్రయత్నిస్తే దాదాపు 14 షాపులు పూర్తిగా ఆస్తి నష్టపోయి జీవన వ్యాపారం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని జీవనోపాధి కోల్పోయి వీధిన పడే అవకాశం ఉందని, ఒకరిద్దరూ పూర్తిగా సర్వస్వం కోల్పోయే ప్రమాదం ఉన్నది కాబట్టి  అలాంటి పరిస్థితులు రాకుండా  పారదర్శకంగా రోడ్ల విస్తరణ పనులను చేపట్టాలని దానికి మేము పూర్తిగా సహకిరిస్తామని నష్టపోతున్న వారికి బాసటగా నిలుస్తామని ఆయన అన్నారు