05-07-2025 09:15:48 PM
42 శాతం రిజర్వేషన్లు అమలుపై ఆలస్యం ఎందుకు
విద్య వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేశాడు
బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్
మహేశ్వరం: కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ విమర్శించారు. శనివారం మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ లోని ఎస్ఎన్ రెస్టారెంట్ లో జిల్లా బీసీ నాయకుల ముఖ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారితో పోరాటం జిల్లా ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా దాసు సురేష్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు పై జాప్యం చేస్తుందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులను,మంత్రులను గ్రామాలల్లో తిరగనివ్వమని ఆయన హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఉదయ్ పూర్,కామారెడ్డి డిక్లరేషన్ హామీలను మరిచిపోయిందన్నారు.రాహుల్ గాంధీ హామీలను రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మాటలకు పొంతన లేదన్నారు.సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేయడం లేదన్నారు.రాష్ట్రంలో విద్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నడన్నారు.ఈడబ్ల్యూఏస్ రిజర్వేషన్ల వల్ల బీసీలు నష్టపోతున్నారన్నారు.బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో కోటి సభ్యత్వాలను చేపడుతున్నామన్నారు.బీసీ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్తామన్నారు.