calender_icon.png 24 May, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ కార్మికులకు పనిముట్లు పంపిణీ...

23-05-2025 11:18:38 PM

హనుమకొండ,(విజయక్రాంతి): గ్రేటర్ వరంగల్ పరిధిలోని దేవన్నపేట టోల్ ప్లాజా సమీపంలో నేషనల్ హైవే రోడ్డు ఇరువైపులా దట్టమైన ముళ్ల పొదలు పెరిగి వాహనాలు ఢీ కొని ప్రమాదాలు జరుగుతున్న విషయం గమనించిన 65 వ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పోలపాక అశోక్ ఆధ్వర్యంలో తన సొంత డబ్బులతో పనిముట్లు కొనుగోలు చేసి మున్సిపల్ జవాను రాజు, మున్సిపల్ కార్మికులకు పనిముట్లు గొడ్డళ్లు పంపిణీ చేశారు. అనంతరం టోల్ గేట్ మెయింటెనెన్స్ ఆఫీసర్స్ వంశీని కలిసి యాక్సిడెంట్లు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరగా రోడ్డుకు ఇరువైపులా బ్యారి కేట్లు రెండు మూడు రోజులలో అధికారులతో మాట్లాడి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో 65 వ డివిజన్ యూత్ నాయకులు గడ్డల రాకేష్, జవాన్ రాజు, మున్సిపాలిటీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.