18-09-2025 03:01:39 PM
ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండల యువజన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా ముత్తారంకు చెందిన అనుము ప్రశాంత్ నియమించినట్లు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తన నియామకానికి సహకరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శ్రీను బాబు కి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందంకు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దొడ్ల బాలాజీకి, పిఎసిఎస్ చైర్మన్ అల్లాడి యాదగిరిరావుకు, ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్యకు, ముత్తారం గ్రామ మాజీ సర్పంచ్ తూటి రజితరఫీకి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బక్కతట్ల వినీత్ కు, యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బియ్యని శివకుమార్ కు మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు వాజిద్ పాష కు కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్ కు ముత్తారం మండల బీసీ సెల్ అధ్యక్షులు అల్లం కుమారస్వామికి మండల నాయకులందరికీ సీనియర్ నాయకులకు ప్రశాంత్ కృతజ్ఞతలు తెలిపారు.