05-08-2025 01:29:19 AM
నారాయణపేట.ఆగస్టు 4.(విజయక్రాంతి):విద్యార్థినీలకు క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు . సోమవారంనాడు ధన్వాడ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వివరాలు, పాఠశాల వివరాలు, స్టాఫ్ వివరాలు, మధ్యాహ్న భోజనం వివరాలను రిజిస్టర్లతో సహా ,జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకోని రావాలని ఎస్. ఓ .గంగమ్మ ను ఆదేశించారు.
విద్యార్థినిలు 85% మాత్రమే ఎఫ్ ఆర్ ఎస్ లో నమోదయినందుకు ప్రత్యేక అధికారికి సూచించారు .ప్రతిరోజు ఉపాధ్యాయులు సమయపాలన పాటించి వంద శాతం నమోదు చేసుకుంటూ విద్యార్థులను కూడా వంద శాతం నమోదు చేయాలని సూచనలు ఇచ్చారు.అనంతరం దన్వాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి స్టాఫ్ వివరాలు ప్రతిరోజు ఓపి ఎంత వస్తుందో అడిగి తెలుసుకున్నారు.
ఎన్ని సబ్ సెంటర్లు ఉన్నాయని అడగగా ఐ దు ఉన్నాయని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. పీహెచ్ నర్సుకి మెమో జారీ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏఎంసి , పీఎం ఎస్‌ఎంఎ రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయిదు క్యాంపులను నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం వ్యాక్సిన్ రూమ్ లేబర్ రూమ్, హోమియో డిస్పెన్సరీ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డి. ఈ. ఓ. గోవింద్రాజులు , ఎంఇవో, తహశీల్దార్ సిందూజ. ఎంపీడీవో ,వైద్యులుపాల్గొన్నారు.