05-08-2025 01:30:54 AM
ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ అతార్ సింగ్ రావ్
నాగర్ కర్నూల్ ఆగస్టు 4 (విజయక్రాంతి) భారతదేశా నికి మాయావతిని ప్రధా ని చేయడమే బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కార్యకర్తల ప్రధాన లక్ష్యంగా పటిష్టం గా పనిచేయాలని ఉత్తరప్రదేశ్ మాజీ ఎమ్మె ల్సీ అతార్ సింగ్ రావ్ పిలుపునిచ్చారు. సో మవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బోనాసి రాంచందర్ ఆధ్వర్యంలో జిల్లా సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ పార్టీ సెంట్రల్ స్టేట్ కో-ఆర్డినేటర్ దాగిళ్ళ దయానంద్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ తో పాటు ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. అంబేద్కర్ ఆలోచనలు, కాన్షీరాం దిశానిర్దేశం, మాయావతి నాయకత్వం ద్వారానే బహుజనులకు రాజ్యాధికార సాధ్యమౌతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఇతర పార్టీలు బహుజనాలకు వ్యతిరేకమని దేశంలోని 85% బహుజన జనాభాకు బీఎస్పీనే ఏకైక వేదికగా నిలుస్తోందన్నారు.
2029లో బీఎస్పీ జెండా ఎర్రకోటపై ఎగరాలంటే ప్రతి కార్యకర్త సమర్థంగా పనిచేయాలన్నారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడే శక్తి ఒక్క బీఎస్పీకే ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న, కోశాధికారి ప్రణయ్, కార్యదర్శి అనిల్, రాష్ట్ర ఈసీ నెంబర్ పృథ్వీరాజ్, జిల్లా ఇన్చార్జీలు యోసేఫ్, కళ్యాణ్, అసెంబ్లీ ఇంచార్జులు కుమార్ తదితరులుపాల్గొన్నారు.