05-08-2025 01:27:38 AM
ప్రత్యేక పూజలు చేసిన మాజీమంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల ఆగస్టు 4 : మున్సిపాలిటీ పెద్దగుట్ట దగ్గర కొలువుతీరిన శ్రీ శ్రీ శ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో శ్రావణ మాస ఉత్సవాల అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సందర్బంగా స్వామి వారిని మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి శ్రీ రంగనాయక స్వామి ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అందరు సుఖ సంతోషాలతో చల్లగా జీవించేలా ఆశీర్వదించు స్వామి అంటూ భగవంతుని వేడుకున్నట్లు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.