13-01-2026 12:36:37 AM
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, జనవరి 12 (విజయ క్రాంతి): క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీ నివాస్ అన్నారు.సోమవారం రాజన్న సిరిసి ల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా టీచర్స్ ప్రీమియం లీగ్ సీజన్ 5 ప్రారంభోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.వారు మా ట్లాడుతూ విద్యార్థులకు విద్య బోధించే ఉపాధ్యాయలు క్రీడల పట్ల మక్కువతో దివంగత మంకు రాజయ్య యాదిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గతంలో పాఠశాలల్లో గంట పాటు అటల పోటీలకు ప్రత్యేక పీరియడ్ ఉండేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల్తో ప్రెండ్లి గా ఉంటుందని తెలిపారు.ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతో కాలం నుండి ఎదురు చూ స్తున్న టీచర్ల ప్రమోషన్స్ ఇవ్వడం అభినందనీయమన్నారు.
ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సుమారు 11 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారని మరో మారు డిఎస్సీ కోసం చ ర్యులు తీసుకుంటుందని తెలిపారు.గతంలో జీతాలు నెల మధ్యలో వచ్చేవని కానీ నేడు నెల మొదటి తేదీన వేతనాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు..సిరిసిల్ల పట్టణంలో క్రీడాకారుల కోసం 5 ఎక రాల స్థలం కేటాయించామని తెలిపారు.ఎల్లపుడూ క్రీడాకారులకు తన వంతు సహాయ సహారాలు ఉంటాయని అన్నారు. రాష్ట్ర ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాలకు పెద్ద పీట వేస్తన్నరని అందులో భాగంగా రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.