30-12-2025 12:00:00 AM
వీకెండ్ డెస్టినేషన్‌గా ములుగు జిల్లా
పర్యాటక ప్రదేశాల సమాచారంపై పోటీలు
ములుగు, డిసెంబర్29(విజయక్రాంతి): పర్యాటక శాఖ 100ప్రదేశాలను వీకెండ్ డెస్టినేషన్ గా చెయ్యడానికి ఔత్సాహికుల నుండి పర్యాటక ప్రాంతాలను పర్యాటక శాఖ వె బ్సైట్ లో అప్లోడ్ చెయ్యడానికి ఈ పోటీని ని ర్వహిస్తున్నది ఇందులో భాగంగా రూపొందించిన పోస్టర్ ను సోమవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తన ఛాంబర్లో విడుదల చేశారు.
వీకెండ్ డెస్టినేషన్ గా ములుగు జిల్లా
రాజధాని హైదరాబాద్ నుంచి రెండు, మూడు గంటల ప్రయాణంలోనే చారిత్రక కట్టడాలు,సాంస్కృతిక వైభవం,అభయారణ్యాలను ఆస్వాదించాలంటే ఉమ్మడి వరం గల్ ను సందర్శించాల్సిందే. కాకతీయుల చ రిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచిన, యు నెస్కో గుర్తింపు పొందిన రామప్ప, వేయి స్తంభాల ఆలయం,వరంగల్, భద్రకాళి ఆలయం,ఘనపురం కోటగుళ్లు,లక్నవరం సరస్సు ,పాకాల సరస్సు,భోగత జలపాతం, మేడారం జాతర, ఏటూరునాగరం, తాడ్వా యి అభయారణ్యాలు, పాండవుల గుహలు దేశ, విదేశీ పర్యాటకులు ఇష్ట పడే ప్రాం తాలు చాలా ఉన్నాయి.
సాహస క్రీడల ప్రాం తాలు, చరిత్రక లోకల్ ఫుడ్ వరంగల్ కు ప్రత్యేకంగా గుర్తింపు ఉంది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోని పర్యాటక ప్రాం తాల పరిచయంలో భాగంగా 100 ప్రదేశాలను ‘వీకెండ్ డెస్టినేషన్లు’గా మార్చేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ సరికొత్త ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఇప్పటికి అంతగా వెలుగులోకి రానివి ఈ జాబితాలో చేరుస్తోం ది. ఆయా ప్రాంతాలకు హైదరాబాద్ తో పాటు జిల్లాల నుం పర్యాటకుల్ని పెంచాలన్నది ప్రధాన లక్ష్యం.
వీకెండ్ ట్రిప్ ప్లాన్స్....
వీకెండ్ ట్రిప్ లపై ఆసక్తి ఉన్నవారు హైదరాబాద్లోనే సుమారు 10 లక్షల మంది ఉంటారని పర్యాటక సంస్థ అంచనా వేసింది. ప్రధానంగా ఐటీ ఉద్యోగులతోపాటు వర్సిటీల్లో విద్యార్థులు, పరిశ్రమల్లో పనిచేస్తున్న వారు తమ స్నేహితులు, కుటుంబాలతో ప్ర యాణాలకు ఆసక్తి చూపిస్తున్నారని గుర్తించింది. ఈ ’హైపర్ లోకల్ టూరిస్టు’లను దృ ష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నుంచి 50-250 కి.మీ. దూరంలో 100 వారాంతపు ప ర్యాటక ప్రదేశాల సమాచారాన్ని క్రౌడ్ సో ర్సింగ్ ద్వారా సేకరిస్తోంది.
ప్రధానంగా శని, ఆదివారాలు లేదా ఇతర సెలవు రోజుల్లో ఒకట్రెండు రోజులు సరదాగా వెళ్లివచ్చే ప్రదేశాలను ఈ జాబితాలో చేరుస్తోంది. ఆయా ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ, సమీపంలోని వసతి సదుపాయాలు.. అడ్వెంచర్, వాటర్ స్పోరట్స్, స్థానిక వంటకాలు వంటి పూర్తి స మాచారాన్ని పర్యాటక సంస్థ అధికారులు సేకరిస్తున్నారు.100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ’ పోటీలకు ఆహ్వానం రాష్ట్రంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలకు ప్రాచు ర్యం కల్పించే విధంగా ’100వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో పోటీలను నిర్వహిస్తున్నట్లు టూరిజం డెవల ప్మెంట్ కార్పొరే షన్ ఎండీ వల్లూరు క్రాంతి వెల్లడించారు.
తెలంగాణలోని పర్యాటక ప్రదేశం స్పష్టంగా కనిపించేలా 3ఫొటోలు, 60సెకెన్ల వీడియో, వంద పదాల్లో ప్రత్యేకతను వివరిస్తూ జన వరి 5లోగా ఎంట్రీలను పంపాలని సూచించారు. అందులో హైదరాబాద్ నుంచి కనె క్టివిటీ, వసతి తది తర వివరాలను తెలియజేయాలని సూచించారు. ప్రథమ, ద్వితీయ తృతీయ విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు ఇస్తామన్నారు. పది మందికి కన్సొలేషన్ బహుమతులు అంద జేస్తామన్నారు. సంక్రాంతి రోజున కైట్ ఫెస్టివల్లో బహుమతులను ప్రదానం చేస్తారు.