30-12-2025 12:00:00 AM
హద్దు మిరితే చర్యలు తప్పవు
మరిపెడ, డిసెంబర్ 29 (విజయక్రాంతి): న్యూ ఇయర్ వేడుకలను ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలనీ మరిపెడ ఎస్త్స్ర వీరభద్రరావు అన్నారు. ముఖ్యంగా హైవే పైన , రోడ్ల పైన కేక్ కటింగ్ చేయరాదని, హోటల్స్ , రెస్టారంట్స్ నిర్వాహకులు సమయపాలన పాటించాలని , ఈవెంట్లలో డ్రగ్స్ లేదా ఇతర నిషేధిత పదార్థాల వినియోగం జరిగితే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
మద్యం సేవించి వాహనం నడిపితే భారీ జరిమానా, లైసెన్స్ రద్దు జైలు శిక్ష తప్పదని, మరిపెడ పట్టణం అంతటా ప్రత్యేక తనిఖీ బృందాలు ఉంటాయని, ర్యాష్ డ్రైవింగ్ , బైక్ రేసింగ్, అతివేగం, సైలెన్సర్ శబ్దాలతో ఇబ్బంది కలిగించే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. వేడుకల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై షీ టీమ్స్ (షీ టీం) నిఘా ఉంటుందని, అత్యవసర సమయంలో ఏదైనా సాయం కోసం వెంటనే డైల్ 100 లేదా 112 కి కాల్ చేయాలని కోరారు.