calender_icon.png 17 August, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుల గైర్హాజర్‌పై కలెక్టర్ ఆగ్రహం

13-08-2025 12:00:00 AM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఆగస్టు 12 (విజయ క్రాంతి): ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు రాకుండా ఇంకెప్పుడు వస్తారంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తులు చేశారు. మంగళవారం ముపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గిరిజన ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ రాహుల్ శర్మ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలో అందిస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య, హాజరైన వారి సంఖ్య అడిగి తెలుసుకున్న కలెక్టర్ మిగిలిన వారు కరణం లేకుండా గైర్హాజర్  కావడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంతనలేని సమాధానం చెప్పడం సరికాదని, ఇకముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి విద్య బోధన, వసతి, భోజనం తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. అలాగే వంటగది, సామాగ్రి భద్రపరిచే స్టోర్ రూమును పరిశీలించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవసరమైన వసతులు కల్పిస్తామని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులు, ఇబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు . సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఇన్చార్జి డిఎంహెచ్వో డాక్టర్ శ్రీదేవి, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.