13-08-2025 12:00:00 AM
బిచ్కుంద ఆగష్టు 12 ( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని మైనారిటీస్ రెసిడెన్షియల్ పాఠశాల & జూనియర్ కళాశాలను మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సందర్శించారు. పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.