calender_icon.png 11 October, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తహాసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష

11-10-2025 01:35:06 AM

నారాయణపేట.అక్టోబర్ 10(విజయక్రాంతి):జిల్లాలో ప్రభుత్వ భూముల సమగ్ర వివరాలను సేకరించి భూ భారతి పోర్టల్ లో నమోదు చేసి వాటిని నిషేధిత జాబితాలోకి చేర్చాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూ చించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను తో కలసి అన్ని మండలాల తహాసిలా ర్ల తో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ..

మండలాల వారీగా అసైన్డ్ భూములు,ఎండోమెంట్స్, వక్ఫ్ బోర్డులు లే దా ఇతర మత సంస్థలకు కేటాయించిన భూ ములు, సీలింగ్, భూదాన్ భూముల వివరాలను సేకరించి వాటిని భూ భారతి పోర్టల్ లో నమోదు చేసి నిషేధిత జాబితాలోకి చే ర్చాలని తెలిపారు.మండలాలవారీగా ఆయా భూముల వివరాలను తహశీల్దార్ల ను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

వరి కొనుగోలు కేంద్రాలపై పర్యవేక్షణ తప్పనిసరి

 జిల్లాలో ఈ ఖరీఫ్ వానాకాలం సీజన్ లో వరి ధాన్యం దిగుబడి పెరిగిందని, ప్రభు త్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చే సేందుకు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల పై తహసీల్దార్ల పర్యవేక్షణ ఉండాలని రెవె న్యూ అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. గత సీజన్ లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని చె ప్పారు.

మండల స్థాయిలో ఏవో, ఏఈఓ, హార్వెస్టర్ లతో తహసిల్దార్లు సమావేశం ని ర్వహించి వరి కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో సజావుగా కొనసాగించేలా చూడాలన్నారు. వరి ధ్యానంతో పాటు ఈ సారి పత్తి కొనుగోళ్ల విషయంలో ను ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీలులేదని, కపాస్ కిసాన్ యాప్ లో రైతులు తమ స్లాట్ బుక్ చేసుకునే విధంగా రైతులకు అవగాహన కల్పిం చాలని ఆయన సూచించారు.

సమావేశంలో ఆర్డీవో రామచందర్ నాయక్, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి బాలామణి, పౌరసరఫరాల శాఖ అధికారులు సైదులు, బాల్ రాజ్, అన్ని మండలాల తహా సిల్దారులుపాల్గొన్నారు.