calender_icon.png 15 October, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

15-10-2025 01:35:19 AM

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 14 (విజయక్రాంతి): భూభారతి రెవిన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తులను, క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం బీబీనగర్ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ అకస్మిక  తనిఖీ చేశారు. కార్యాలయం కి వచ్చిన దరఖాస్తుదారులను ఎందుకు వచ్చారని అడిగి తెలుసుకున్నారు.

జనన, మరణాల, ధృవీకరణ పత్రాలు, కుల ,ఆదాయ ధృవీకరణ పత్రాలు వెంటనే జారీ చేయాలని అన్నారు. భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వేగంగా క్లియర్ చేయాలి అన్నారు. సాదాబైనామ పరిష్కరానికి నోటీసులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ భూముల విషయం లో క్షేత్రస్టాయి లో పరిశీలించలన్నారు.

మండలం లో సర్వే కోసం దరఖాస్తులు ఎక్కువగా ఉండటం, సర్వే చేయడానికి,  ఎక్కువ సమయం తీసుకోవడం,సర్వే చేసినవాటీలో  ఎక్కువ రిజెక్ట్ చేయడం వంటివి తన దృష్టికి రావడంతో సర్వేయర్‌కు మెమో జారీ చేసినట్లు కలెక్టర్ వివరించారు. అనంతరం పోషన్ అభియాన్ లో భాగంగా బీబీనగర్ మండల ఎంపీడీఓ కార్యాలయంలో పోషణమాసం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్  సరైన పోషణతో ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని నిర్మించాలని ఉద్దేశంతో  పోషణమాంసం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. 

గర్భిణి స్త్రీ లు మంచి పౌష్టికాహారం తీసుకోవడం , రోజు యోగ , ధ్యానం చేయడం వల్ల తో  సార్ నా ప్రసవాలు జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. దానివల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రతి అంగన్వాడీ సెంటర్ కి రోజు గర్భిణి స్త్రీ లువచ్చి సెంటర్ లో ఇచ్చే బలమైన ఆహారం తీసుకోవాలి. మీకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా పిల్లలకు ఇచ్చే బాలామృతం తినిపించడం వల్ల బిడ్డ ఎదుగుదల బాగుంటుందని అన్నారు.  రాబోయే రోజుల్లో ప్రతి అంగన్ వాడి సెంటర్ లలో కనీసం 20 మంది పిల్లలు ఉండేలా చూడాలి .  అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఉండే ప్రతి చిన్నారి మన అంగన్వాడీలోకి వచ్చేలా చూడాలన్నారు.

షోకాజ్ నోటీస్ జారీ జిల్లా కలెక్టర్ 

బీబీనగర్ మండలం గూడూరు పల్లె దవాఖానని ఆకస్మికలో తాళం వేసి ఉండటంతో ఎంఎల్‌ఎపికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.