15-10-2025 01:36:28 AM
-వర్సిటీలకు విద్యాశాఖ ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖ పరిధిలోని యూనివర్సిటీలకు రూ.500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ నిధులను విడుదల చేసేందుకు యూనివర్సిటీల నుంచి వివరాలను విద్యాశాఖ మరోసారి సేకరిస్తోంది. ఓయూ, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలకు రూ. 100 కో ట్ల చొప్పున, కాకతీయ వర్సిటీకి రూ.50 కోట్లు, ఎంజీయూ, శాతవాహన, పాలమూరు, తెలంగాణ, తెలుగు వర్సిటీలకు రూ.35 కోట్ల చొప్పున, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి రూ.25 కోట్లు ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించారు.
ఈ నిధులను ఏ విధంగా ఖర్చు పెడతారు? ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, భవన నిర్మాణాలు చేపడతారో స వివరంగా వివరాలను పంపించాలని విద్యాశాఖ కోరింది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి అధికారులు, వర్సిటీ వీసీలతో విద్యాశాఖ సెక్రటరీ జూమ్ మీటింగ్‌ను మం గళవారం నిర్వహించినట్లు తెలిసింది. అయి తే గతంలోనే వర్సిటీలకు వివరాలను అడిగినప్పటికీ అవి స్పష్టంగా లేకపోవడంతో సమ గ్రంగా మరోసారి వివరాలను పంపాలని ఆ దేశించింది. కాగా రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించి కూ డా ఆరు నెలలు కావొస్తున్నా వర్సిటీ అభివృ ద్ధి పనుల కోసం కేటాయించిన నిధులను ఇంత వరకూ విడుదల చేయకపోవడం గమనార్హం.