3 July, 2026 | 2:15 AM

కళాశాలల బంద్ విజయవంతం

03-07-2026 01:30 AM

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్

ముకరంపుర, జూలై 2 (విజయక్రాంతి): బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నారోజు రాకేష్ ఆధ్వర్యంలో జరిగిన కళాశాల బంద్ విజయవంతమైంది. కరీంనగర్ లోని కళాశాలల బంద్ కార్యక్రమంలో హాజరైన బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రం ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తి వేయాలని చూస్తే రాష్ట్రం అగ్ని గుండంగా మారుతుందని హెచ్చపించారు.

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు 10000 వేల కోట్ల రూపాయలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ మాట్లాడుతూ బీసీ సంఘాల నాయకులను పోలీసుల అరెస్ట్ లతో ఉద్యమం ఆగదని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అనుబంధ నాయకులు రంగు సంపత్, దొగ్గలి శ్రీధర్, తదితర బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.