03-08-2025 12:08:13 AM
మల్కాజిగిరి, ఆగస్టు 2 (విజయక్రాంతి) : మౌలాలి డివిజన్లోని మోడల్ సుధా నగర్ కాలనీలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించాల్సిందిగా కాలనీవాసులు మల్కాజి గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి మర్యాదపూర్వకంగా వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ, కాలనీలో త్రీఫేస్ విద్యుత్ సరఫరా లేకపోవడం, డ్రైనేజీ సదుపాయం సరిగ్గా లేకపోవడం, బోరు వెల్ మరమ్మత్తులు అవసరంగా ఉండటం, అలాగే చిన్నపాటి వర్షానికే వరదనీరు ఇళ్లలోకి ప్రవేశించడం వంటి సమస్యలు ఉన్నా యని తెలిపారు. బాక్స్ డ్రైనేజీ నిర్మాణం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన కోరారు. కాలనీవాసుల వినతిని సానుకూలంగా స్వీకరించిన ఎమ్మెల్యే, తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు నరేష్, నవాబ్, కాశీనాథ్, మల్లారెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.