calender_icon.png 3 August, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుని కుటుంబాన్ని ఓదార్చిన మాజీ ఎమ్మెల్యే

03-08-2025 12:07:35 AM

రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): మందమర్రి కేకే 5 గని ప్రమాదం అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సింగరేణి యాజమాన్యంపై మండిపడ్డారు. రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి మార్చరీలో ఉన్న యువ కార్మికుడు రాసపెల్లి శ్రావణ్ కుమార్ మృతదేహానికి నివాళులు అర్పించి తన కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రవణ్ కుమార్ చనిపోవడం చాలా బాధాకరమని కార్మికుల భద్రతను యాజమాన్యం గాలికి వదిలేసిందని ఆరోపించారు. యాజమాన్యం కేవలం లాభాలు అర్ధించాలనే ఆలోచన తప్ప కార్మికుల భద్రతపై శ్రద్ధ చూపడం లేదని అన్నారు.ఇరవై నెలల కాంగ్రెస్ పాలనలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల భద్రతకు పెద్ద పీట వేయాలని సూచించారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సింగరేణి హెచ్చరించారు.