03-08-2025 12:10:24 AM
-సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సనత్‌నగర్ ఆగస్టు 2 (విజయక్రాంతి):- ఎన్నికల సమయంలో మాత్రమే తాను రాజకీయాలు ఆలోచిస్తానని, ఆ తర్వాత అభివృ ద్ధి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతానని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం అమీర్ పేట డివిజన్ లోని బల్కం పేటలో గల శ్రీ వీర హనుమాన్ వ్యాయామశాలకు ధాతల సహకారంతో 10 లక్షల రూపాయల విలువైన పరికరాలను వ్యాయామశాలకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యా దవ్ చేతుల మీదుగా నిర్వాహకులకు అందజేసి ప్రారంభించారు.
అనం తరం దాతలు గౌతమ్, వెంకట రాజ, శ్రీ హరి, సుబ్బరాజు, అనంత రెడ్డి, సుభాష్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి తదితరులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శాలువాలతో సత్కరించి జ్ఞాపికల ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గం నుండి తన కంటే ముందు ప్రాతినిధ్యం వ హించినవారు ఉన్నారని, కానీ 2014 లో తాను వచ్చిన తర్వాతనే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలను ఒకే విధంగా అభివృద్ధి చేసి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరిం చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాయామశాల నిర్వాహకులు రాజేశ్వర్, భిక్షపతి, అమీర్‌పేట, సనత్ నగర్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు హన్మంతరావు, కొలన్ బాల్ రెడ్డి, నాయకులు సంతోష్ కుమార్ ఉన్నారు.