calender_icon.png 8 July, 2025 | 10:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు విచారణకు రండి

03-07-2025 12:36:47 AM

  1. ఐఏఎస్ అరవింద్‌కుమార్‌కు ఏసీబీ నోటీసులు
  2. ఫార్ములా -ఈ-కార్ రేస్ కేసులో విచారణ
  3. ఇప్పటికే మూడుసార్లు హాజరు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై ౨ (విజయక్రాంతి): ఫార్ములా -ఈ-కార్ రేస్ కేసులో దర్యాప్తును ఏసీబీ మరింత ముమ్మ రం చేసింది. గురువారం ఉదయం 11:30 గంటలకు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌కు నాలుగోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే అరవింద్‌కుమార్‌ను మూడుసార్లు ప్రశ్నించిన ఏసీబీ, తాజాగా మరోసారి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

బీఆర్‌ఎస్ హయాంలో 2023లో హైదరాబాద్‌లో అ త్యంత ప్రతిష్ఠాత్మకంగా ఫార్ములా -ఈ రేస్‌ను నిర్వహించారు. ఈ రేస్ నిర్వహణలో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. లండన్‌కు చెందిన  ఎఫ్‌ఈఓకు హెఎండీఏ దాదాపు రూ.55 కోట్లు బదిలీ చేయడమే ఈ ఆరోపణలకు ప్ర ధాన కారణం. ఈ చెల్లింపులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘిస్తూ జరిగాయని ఏసీబీ తన ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టం గా పేర్కొంది.

అంతేకాకుండా రాష్ర్ట కేబినెట్, హెఎండీఏ బోర్డు, ఆర్థిక శాఖల అనుమతు లు లేకుండానే ఈ నిధుల బదిలీ జరిగిందని ఆరోపించింది. ఈ లావాదేవీల వల్ల రూ.8. 06 కోట్ల పన్ను భారం కూడా హెఎండీఏపై పడిందని ఏసీబీ తెలిపింది. ఈ కేసులో అప్పటి మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ1గా, అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ను ఏ2గా, హెఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని ఏ3గా ఏసీబీ కేసు నమోదు చేసింది.

ఎఫ్‌ఈవోకు 2023 అక్టోబర్‌లో రెండు విడతలుగా అక్టోబర్ 3, 11న రూ.45.71 కోట్లు బదిలీ చేశారు. అయితే అధికారిక ఒప్పందం మాత్రం అక్టోబర్ 30 నే కుదిరింది. అంటే ఒప్పందం కుదరక ముందే డబ్బులు చెల్లించారు. ఆ సయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా జరిగినట్లు ఏసీబీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది.

ఈ చెల్లింపులు అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే జరిగాయని, రాష్ర్ట బ్రాండ్ ఇమేజ్‌కు ఎలాంటి నష్టం కలగకుండా చూసేందుకే బదిలీ జరిగిందని అరవింద్‌కుమార్ గతంలో ఏసీబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  విచారణల్లో తెలిపారు. ఈ కేసులో కేటీఆర్‌ను గత జనవరి 9న ఏసీబీ, జనవరి 16న ఈడీ విచారించాయి.

బీఎల్‌ఎన్‌రెడ్డిని జనవరి 8న ఈడీ ప్రశ్నించింది. ఈ దర్యాప్తులో భాగంగా ఎఫ్‌ఈఓతో జరిగిన సంభాషణలు, హెఎండీఏ నుంచి నిధుల బదిలీకి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మొదట స్పాన్సర్‌గా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్థిక నష్టాల కారణంగా తొలి రేస్ తర్వాత తప్పుకోవడంతో, ఆ తర్వాత హెఎండీఏనే స్పాన్స ర్‌గా వ్యవహరించడం కూడా దర్యాప్తులో కీలక అంశంగా మారింది.