03-07-2025 12:35:51 AM
సనత్ నగర్, జూలై 2 (విజయక్రాంతి) : విజయనగర్ కాలనీ బ్రాంచ్ నారాయణ పాఠశాలలో విద్యార్థులు జాతీయ వైద్యుల దినోత్స వాన్ని ఘనంగా జరుపుకున్నారు ఇందులో భాగంగా విద్యార్థులు శతస్కోప్ ,డాక్టర్ కోట్స్, డాక్టర్ కిట్లను ధరించి డాక్టర్ల వేషధారణలో వచ్చి అందరిని అలరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విరించి హాస్పిటల్ పీడియాట్రిక్ వన్నెల రాజు విచ్చేసి విద్యార్థులకు ఆరోగ్యమే మహాభాగ్యం అనే అంశంపై అవగాహన కల్పించారు విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత పౌష్టికాహారం వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి విద్యార్థులకు చక్కగా వివరించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నూరిన్ ఫాతిమా మాట్లాడుతూ మన ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమించే వైద్యులను గౌరవించు కోవ డానికి జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్నామని వారి సేవలను గుర్తించి వారికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలపాలని కోరారు ఈ కార్యక్రమంలో జిఎం గోపాల్ రెడ్డి ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు