calender_icon.png 8 July, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్స స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం

03-07-2025 12:37:09 AM

-విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

ముషీరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): అప్స స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయమని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి అన్నారు. ఈ మేరకు బుధవారం కవాడిగగూడ డివిజన్ దోమలగూడలోని భారత స్కాట్ అండ్ గైడ్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఉద్దేశించి పాఠశాల ప్రదానో పాధ్యాయురాలు మాధవి మాట్లాడుతూ అప్సాలాంటి స్వచ్ఛంద సంస్థలు వివిధ దాతల ద్వారా విద్యార్థులకు సహాయ కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయం అన్నారు. విద్యార్థులు అందరూ చిన్నతనం నుండే సేవ గుణమును నైతిక విలువలను పెంపొందించుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు కుమార్ గౌడ్, అప్సా స్వచ్ఛంద సంస్థ సీనియర్ కోఆర్డినేటర్ బొట్టు రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.