calender_icon.png 5 August, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

5న సమావేశానికి రండి

04-08-2025 01:29:39 AM

-బీఆర్‌ఎస్‌కు ఈసీ ఆహ్వానం

-ప్రతినిధి బృందానికి కేటీఆర్ నేతృత్వం 

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): ఢిల్లీలోని నిర్వాచన్ సదన్ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 5న దేశంలోని రాజకీయ పార్టీలతో తాము నిర్వహించే సమావేశానికి బీఆర్‌ఎస్ ప్రతినిధి బృందాన్ని భారత ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆహ్వానించింది. ఈ మే రకు ఈసీఐ కార్యదర్శి అశ్విని కుమార్ మొ హాల్ ఒక అధికారిక లేఖలో కోరారని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పార్టీ వ ర్గాలు తెలిపాయి.

మీడియా వర్గాల సమాచా రం ప్రకారం ఈ సమావేశంలో ఎన్నికల సం స్కరణలు, ఇప్పటికే ఈసీకి సమర్పించిన వి విధ అభ్యర్థనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి సంబంధిత అంశాలపై చర్చించను న్నట్లు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. సమావేశానికి హాజరుకానున్న ప్రతిని ధి బృందానికి  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వం వహించనున్నారు. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, బాల్క  సుమ న్, సీనియర్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.