16-12-2024 01:14:55 AM
సిరిసిల్ల, డిసెంబర్ 15 (విజయక్రాంతి): సమగ్ర శిక్ష ఉద్యోగులు చర్చలకు రావాలని, చర్చించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని బీసీ సంక్షేమ, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో శనివారం దత్తత్రేయ స్వామి దర్శనం చేసుకునేందుకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ సమగ్ర శిక్ష ఉద్యోగులతో స్థానిక కాంగ్రెస్ నాయకులు సింగీతం శ్రీనివాస్ ఫోన్‌లో మాట్లాడించారు.
ఆదివారం ‘విజయక్రాంతి’ దినపత్రికలో ప్రచురితమైన ‘సమగ్ర శిక్ష.. దీక్ష ఫలించేనా’ అనే కథనానికి మంత్రి స్పందించారు. వారిని చర్చలకు ఆహ్వానించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఐదురుగు హైదారాబాద్‌కు వస్తే, సంబంధిత మంత్రితో పాటు సీఎం రేవంత్‌రెడ్డిని కల్పించి, సమస్యల పరిష్కార మార్గం చూద్దామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రత్యేక తెలంగాణలో సైతం ఇలాంటి దీక్షలు చేపట్టడం సరికాదని, ప్రజా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరూ ఇబ్బంది పడాల్సిన పనిలేదన్నారు.