calender_icon.png 14 September, 2025 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధుయాష్కీ పుట్టినరోజు వేడుకలు

16-12-2024 01:14:35 AM

ఎల్బీనగర్ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు

ఎల్బీనగర్, డిసెంబర్ 15: టీపీసీసీ ప్రచా ర కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం ఎ ల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణు లు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టారు. వృద్ధులకు పండ్లు, విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చే శారు. వనస్థలిపురంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హైదరాబాద్ మార్కె ట్ కమిటీ డైరెక్టర్ నేలపాటి రామారావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.

ఎల్బీనగర్‌లోని అనాథ విద్యార్థిగృహంలో విద్యార్థుల కు నోట్‌బుక్స్, పండ్లను అనంతుల సురేందర్‌రెడ్డి పంపిణీ చేశారు. కీర్తన ఫౌండేషన్ మా నసిక వికలాంగుల ఆశ్రమంలో నాగార్జున విద్యాసంస్థల ఎండీ మణికొండ భరత్‌గౌడ్ అన్నదానం చేశారు. ప్రగ్మా దవాఖాన చైర్మన్ కొండొజు శ్రీనివాస్ ఆధ్వర్యం లో రక్తదాన శిబిరం నిర్వహించారు.

ఆయా కార్యక్రమా ల్లో ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్యనాయక్, నాయకులు చలకాని వెంకట్ యాద వ్, శ్రీపాల్‌రెడ్డి, కుట్ల నర్సింహయాదవ్, వేణుగోపాల్‌యాదవ్, పాశం అశోక్‌గౌ డ్, బుడ్డ సత్యనారాయణ, గణేశ్‌నాయక్, స్వర్ణమాధవి, బద్రీనాథ్, రామకృష్ణారెడ్డి, గణేశ్‌రెడ్డి, నారాయణ, సురేందర్, చందునాయక్, వెంకటేశ్‌గౌడ్ పాల్గొన్నారు.