16-12-2024 01:16:53 AM
హుజూరాబాద్, డిసెంబర్ 15: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రాకేష్ శనివారం అర్ధరాత్రి జమ్మికుంటకు పనినిమిత్తం వచ్చి తిరిగి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. జగ్గయ్యపల్లి గ్రామ శివారులో వాహనం అదుపుతప్పి కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యులు ఎవరో వాహనం ఢీకొట్టినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ, న్యాయం చేయాలంటూ ఆదివారం ధర్నా చేశారు.