24-11-2025 06:18:51 PM
అక్కలదేవిగూడెంలో ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల పంపిణీ..
చివ్వెంల (విజయక్రాంతి): మహిళల సంక్షేమం, సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామంలో సోమవారం చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
పంపిణీ కార్యక్రమం హర్షోత్సాహంగ
గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మండవ కోటేష్, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. గ్రామంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు చీరలను లాంఛనంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండవ కోటేష్ మాట్లాడుతూ... “మహిళల సంక్షేమం, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో ఇలాంటి పథకాలు అత్యంత ముఖ్యమైనవి. గ్రామంలోని ప్రతి మహిళ ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని పొందాలి” అని తెలిపారు.
లబ్ధిపొందని మహిళల ఆవేదన
కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది మహిళలు.. “పథకం ప్రయోజనం ప్రతి అర్హులైన మహిళకు సమానంగా అందాలి. అందరినీ ఒకేలా చూడాలి” అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నిర్వాహకుల హామీ
ఈ అంశంపై నిర్వాహకులు స్పందిస్తూ.. “భవిష్యత్తులో గ్రామంలోని ప్రతి అర్హులైన మహిళకు పథకాల ప్రయోజనం చేరేలా చర్యలు తీసుకుంటాం. పథకాల అమలులో పారదర్శకతను పాటిస్తాం” అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొండ్ర మల్లయ్య, మండవ రాము, పొట్టి శెట్టి గురవయ్య, పుట్ట వెంకన్న, సమ్మెట వెంకటరమణ, వీఓఏ ఝాన్సీ, కొంగల సంపూర్ణ, అమరగాని రేణుక తదితరులు పాల్గొన్నారు.