calender_icon.png 24 November, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళల సాధికారతకు ప్రజా ప్రభుత్వం అండ

24-11-2025 06:32:40 PM

రూ.27 వేల కోట్ల వడ్డీలేని రుణాలు..

మహిళలు ఆర్థికంగా బలోపేతమైతేనే పేదరికం తగ్గుతుంది.. 

ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి దనసరి సీతక్క, ఎమ్మెల్యే జిఎస్సార్, కలెక్టర్ రాహుల్ శర్మ

రేగొండ (విజయక్రాంతి): మహిళల సాధికారతకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని, మహిళలు అర్థికంగా బలోపేతం అయితేనే పేదరికం తగ్గుతుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. సోమవారం గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సీతక్క భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర  సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ లతో కలిసి పాల్గొన్నారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్దే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఇప్పటివరకు ప్రజా ప్రభుత్వం తరఫున రూ.27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించినట్లు సీతక్క అన్నారు.

పేదరికం తగ్గాలంటే మహిళల చేతిలో డబ్బు ఉండాలని ఆమె నొక్కి చెప్పారు. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ స్ఫూర్తితో మహిళలు ధైర్యంగా, ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి మహిళా శక్తి అనే పేరు పెట్టడం జరిగిందని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే దృఢ సంకల్పంతో మహిళలకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అద్దె బస్సులకు యజమానులను చేయడం, వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను వారికి ఇస్తున్నట్లు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, సోలార్ విద్యుత్ కేంద్రాలు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, మీసేవ కేంద్రాలు వంటి అనేక పథకాలను మహిళల పేరున మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మహిళలకు వడ్డీ లేని రుణాల ద్వారా వ్యాపారాలు, పాడి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

జిల్లా యంత్రాంగం మహిళల ఆర్థిక అభివృద్ధికి అండగా ఉంటుందని, ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కొత్తపల్లి గోరి తాసిల్దార్ లక్ష్మీ రాజయ్య, ఎంపీడీవో రాంప్రసాద్, భూపాలపల్లి వ్యవసాయ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, పిఎసిఎస్ చైర్మన్ నడిపల్లి విజ్జన్ రావు, రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య, కాంగ్రెస్ నాయకులు సూరం వీరేందర్,తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులు ప్రారంభం

జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే రామగుండాల పల్లిలో కొత్తగా రూ.20 లక్షలతో నిర్మించిన పంట పొలాలకు వెళ్లే రోడ్డును ప్రారంభించారు. అనంతరం రూ.10 లక్షలతో నూతనంగా నిర్మించిన స్మశాన వాటికకు వెళ్లే రోడ్డును ప్రారంభించారు. అనంతరం కరెంట్ షాక్ గురై ఇంటి వద్ద చికిత్స పొందుతున్న కాంగ్రెస్ కార్యకర్త తనుగుల మల్లయ్యను ఎమ్మెల్యే పరామర్శించారు. కొత్తపల్లి గోరి మండలంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి రైతులంతా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు పొందాలని కోరారు.

అనంతరం రేగొండ మండల కేంద్రంలోని గుడ్ లైఫ్ స్కూల్ గ్రౌండ్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై మహిళలకు చీరల పంపిణీ చేశారు. అలాగే కొత్తపల్లి గోరి, రేగొండ మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 28 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.8,88000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి హార్దిక భరోసా సీఎం సహాయనిధి అని అన్నారు.