calender_icon.png 24 November, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

26న అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో అయ్యప్ప మహా పడిపూజ

24-11-2025 05:56:26 PM

ముకరంపుర (విజయక్రాంతి): కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఇ టెక్నో పాఠశాలలో ఈనెల 26న అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దైవ కార్యక్రమాలు చేయడం వలన సంతృప్తి కలుగుతుందని, భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా పొందుతామని అన్నారు. మహా పడిపూజ అనంతరం విచ్చేసిన వారందరికీ అల్ప ఉంటుందని తెలిపారు. జిల్లాలోని దీక్షాపరులు ఈ కార్యక్రమానికి హాజరై స్వామి ఆశీస్సులు పొందాలని నరేందర్ రెడ్డి కోరారు. ఈ సమావేశంలో పలువురు దీక్షాపరులు, సిబ్బంది పాల్గొన్నారు.