calender_icon.png 24 November, 2025 | 6:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి

24-11-2025 06:09:12 PM

ఉప్పల్ (విజయక్రాంతి): చట్టాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని నాచారం సబ్ ఇన్స్పెక్టర్ మైబల్లి ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం రోజున నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాచారం చౌరస్తాలో ఉన్న తెలంగాణ మైనార్టీ స్కూల్, జూనియర్ కాలేజ్ లో పోలీస్ అవగాహన సదస్సు వారు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల పనితీరు ప్రజలకు అందించే సేవలు సైబర్ నేరాల పట్ల నివారణ పద్ధతులు షీ టీం డయల్ 100 వంటి సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు యువత మత్తును వదిలి మైదానాలకు రావాలని మత్తు పదార్థాల వల్ల అనేకమైన అనర్ధాలు కలుగుతున్నాయని యువత వాడికి దూరంగా ఉండాలన్నారు.

విద్యార్థినులు మహిళ భద్రత కోసమే ప్రభుత్వం షీ టీంని ఏర్పాటు చేసిందని వారు పేర్కొన్నారు. విద్యార్థులను ఎవరైనా వేధింపులు గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. చరవానికి వచ్చే ఫేక్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు నాచారం పోలీస్ స్టేషన్ సిబ్బంది పెట్రోలింగ్ మొబైల్ కానిస్టేబుల్ పాల్గొన్నారు.