24-11-2025 06:22:46 PM
సిపిఐఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి
సిపిఐఎం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయం ముందు ఆందోళన వినతిపత్రం..
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణ వ్యాప్తంగా ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫారాలను తొలగించాలని, శిధిలవస్థకు చేరి వంగిపోయి, విరిగిపోవటానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభాలను మార్చాలని వెంటనే విద్యుత్ శాఖ అధికారులు నివాస ప్రాంతాలలో పర్యటించి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని సిపిఐ ఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ ఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి టెక్నికల్ ఏఈ రోహిణి కి వినతి పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా గడ్డం స్వామి మాట్లాడుతూ అశోక్ నగర్ కొత్త కాలనీలో కేవలం నాలుగడుగుల ఎత్తులోనే విద్యుత్ ట్రాన్స్ఫారం ఉండటం వల్ల గేదెలు విద్యుత్ ప్రమాదం గురై మరణిస్తున్నాయని చిన్నపిల్లలకు సైతం అందే ఎత్తులో ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. ట్రాన్స్ఫారాన్ని ఎత్తు పెంచాలని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లి స్పందించడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా కొత్త కాలనీలో 30 సంవత్సరాల క్రితం వేసిన విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయి విరిగిపోవటానికి సిద్ధంగా ఉన్నావని వాటి స్థానంలో కొత్త స్తంభాలు వేయాలని డిమాండ్ చేశారు.
రాజుపేట కాలనీలో ఇండ్ల మీద నుండి విద్యుత్ లైన్ లు ఉండటం కరెంటు పోల్ ఇరిగిపోవటం వంటి సమస్యలు ప్రజల్ని వేధిస్తున్నాయని వెంటనే విద్యుత్ శాఖ అధికారులు రాజుపేట కాలనీలో పర్యటించి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రతి సోమవారం విద్యుత్ వినియోగదారుల సమస్యలపై ప్రజా దర్బారు నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకునే విద్యుత్ శాఖ అధికారులు 12 గంటల అవుతున్న ఒక అధికారి కూడా అందుబాటులో లేరని ప్రజాపాలనంటే ఇదేనా అని గడ్డం స్వామి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పారెల్లి సంతోష్ కుమార్ పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ల లీలావతి జీవనజ్యోతి కనక శ్రీ శాఖ కార్యదర్శి గోవర్ధన ఝాన్సీ చెన్నూరు వెంకటరమణ నాయకులు హైమావతి లంబురమణ కాకా రమణ తదితరులు పాల్గొన్నారు