02-09-2025 04:10:21 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): వరద బాధితులకు పరిహారం అందించడంతో పాటు నిత్యవసర సరుకులు పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. వరదలకు గురైన కామారెడ్డి పట్టణంలోని బాధితులకు మంగళవారం నిత్యవసర సరుకులను అందించారు. రాజంపేట మండలంతో పాటు వరద ప్రభావానికి గురైన రాజంపేట బాధితులకు నిత్యవసర సరుకులు అందించాలని ఆర్డీవోను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో వర్షం కురిసిన అధిక వర్షాల వలన సంభవించిన వరద ప్రభావానికి గురైన కుటుంబాలను ఆదుకోవడంలో భాగంగా ఇప్పటికే తాత్కాలిక నష్టపరిహారం అందించడం జరిగిందని తెలిపారు.అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు దుప్పట్లు, చెద్దర్లు, చీరలు, బియ్యం,,పప్పులు తదితర నిత్యవసర సరకులను అందిస్తున్నామని తెలిపారు.