02-09-2025 04:14:38 PM
జుక్కల్,(విజయక్రాంతి): జుక్కల్ నియోజకవర్గంలో మంగళవారం గత రెండు రోజులు నుండి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం అయిన కేసీఆర్ పై చేస్తున్న అసత్య ప్రచారం, కాలేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణతో బురదజల్లే మాటలను వ్యతిరేకిస్తూ కాలేశ్వరం పై వేసిన కమిషన్, తప్పుడు మాటలను వ్యతిరేకిస్తూ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదేశాల మేరకు మంగళవారం మాజీ ఎంపీపీ నీలు పాటిల్ ఆధ్వర్యంలో జుక్కల్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుండి బసవేశ్వర చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం మాటలను మానుకోని ముందు మీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి ప్రజల్లో వెళ్లాలన్నారు. రాబోయే కాలంలో మీకు డిపాజిట్ కూడా రాదు కాబట్టి ఇటువంటి మాటలు మానుకొని అభివృద్ధిపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాలని హితువు పలికారు.