calender_icon.png 11 July, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి

10-07-2025 04:33:06 PM

గీత పని వారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తొట్ల ప్రభాకర్ గౌడ్ డిమాండ్..

నూతనకల్ (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కూకట్ పల్లిలో(హైదర్ గూడ, షంషీగూడ ఇందిరానగర్, కల్లు డిపోలు) కల్తీ కల్లు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గీత పనివారాల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి తొట్ల ప్రభాకర్ గౌడ్(District Assistant Secretary Thotla Prabhakar Goud) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నూతనకల్ మండల కేంద్రంలో గీత పని వారల సంఘం నూతన మండల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ, కల్తీకల్లు తాగి 6 గురు చనిపోయారని మరి కొంతమంది అస్వస్థకు గురయ్యారు. కల్లులో కల్తీ చేయడం వలన ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు. కల్తీ కల్లుకి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతంలోని గీత కార్మికులు స్వచ్ఛమైన ప్రకృతి పానీయాన్ని ప్రజలకు అందిస్తున్నారు.

ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు, సైంటిస్టులు చెప్పుతున్నప్పటికీ ఇలాంటి తరుణంలో కొంతమంది వ్యాపారులు కల్తీ కల్లు కు పాల్పడడం వలన గీత కార్మికులకు నష్టం కలుగుతుందని అన్నారు. అందుకని సంబంధిత అధికారులు కల్తీ జరగకుండా చూడాలని,ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించాలని  గీత పని వారాల జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నూతనకల్ సొసైటీ అధ్యక్షులు బూడిది సైదులు గౌడ్, ముగుళ్ళ వెంకన్న గౌడ్, బండపల్లి శీను గౌడ్, మారగోని వెంకన్న గౌడ్ మొగుల వెంకన్న గౌడ్ , బూడిద రవి, ముత్యo మల్సురు, మద్దెల సురేందర్, బండపల్లి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.