calender_icon.png 10 July, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరుదైన జబ్బుకు యశోద హాస్పిటల్ చికిత్స

10-07-2025 04:30:14 PM

ప్రపంచస్థాయి చికిత్సతో రోగి ప్రాణాలు కాపాడిన వైద్యులు..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ప్రపంచ స్థాయి చికిత్సతో మలక్ పేట యశోద ఆసుపత్రి వైద్యులు రోగి ప్రాణాలను కాపాడారని యశోద హాస్పిటల్(Yashoda Hospitals) అత్యాధునిక వైద్యరంగంలో ముందుందని డైరెక్టర్ కోరుకంటి పవన్, యూనిట్ హెడ్ కె. శ్రీనివాస్ రెడ్డి, చిదుర శ్రీనివాస్ లు తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని మనోరమ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన గౌరు అరుణ కుడి భుజంలో తీవ్రమైన నొప్పి, వాపుతో రక్తనాళాల సమస్యలతో క్లిష్టమైన పరిస్థితుల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని, యశోద హాస్పిటల్ అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ అత్యవసర వైద్య చికిత్స విభాగం డాక్టర్లు 23 గంటల్లో మెరుగైన చికిత్స అందించి  ప్రాణాలను కాపాడమని తెలిపారు.

మలక్ పేట యశోద ఆసుపత్రి వైద్య బృందాల అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలకు, ఆస్పత్రిలో అందించే ఆధ్యాదునిక, వైద్య పరిజ్ఞానంతో కూడిన సేవలకు ఓ తాత్కారం అని తెలిపారు. రక్తనాళాల వ్యాధులతో బాధపడే రోగులకు అత్యవసర పరిస్థితులు ఎప్పుడు ప్రాణాంతకమైనవేనని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. శరీరంలో నిశ్శబ్దంగా ఇవి పెరుగుతూ, ఉన్నపలంగా ఒక్కసారిగా రక్తనాళాలు పగలడం వల్ల తీవ్రమైన నొప్పి కలిగి, అత్యంత రక్తస్రావం వల్ల రోగి ప్రాణాలు పోయే ప్రమాదం హెచ్చుగా ఉంటుందని చెప్పారు. సకాలంలో వారికి వైద్యం అందించకపోతే రోగి ప్రాణాలకు తీవ్రస్థాయిలో ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. యశోద హాస్పిటల్ లో అన్ని శాఖల ఆధునిక వైద్య సేవల సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎ. వాసు కిరణ్ రెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.