25-10-2025 06:20:33 PM
మచ్చర్ల శ్రీకాంత్ బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్
గాంధారి(విజయక్రాంతి): అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మచ్చర్ల శ్రీకాంత్ బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ అన్నారు ఈ మేరకు శనివారం రోజున ఆయన విలేకరులతో మాట్లాడుతూ అకాల వర్షాలతో చేతికి వచ్చిన పంట నేల పాలు అయిపోయింది ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగితే రైతులు నష్టపోకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది.
దీన్ని తెలంగాణలో అమలు చేయక పోవడాన్ని తెలంగాణ యావత్ రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది గత 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులతొని పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.