25-10-2025 06:19:50 PM
సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న ఓ వ్యక్తి..
రెవెన్యూ అధికారులు స్పందించాలని గ్రామస్తుల నిరసన..
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): మండేపల్లి గ్రామంలోని ఓ సర్వే నంబర్ లో గత కొన్ని నెలలుగా భూకబ్జాదారుడు రాత్రి పూట దున్నడం, భూమిలో రాత్రికి రాత్రి చెట్లు పెరగడంతో గ్రామస్తులు శనివారం రోజున రెవిన్యూ అధికారులకు వివరించగా ఆర్ఐ దినేష్, జిపిఓ వేణు రెవెన్యూ సిబ్బంది శనివారం రోజున పరిశీలించారు. గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం భూమి రెవెన్యూకి చెందాలి లేకుంటే గ్రామ అభివృద్ధి కోసం వడ్ల బీటుకు అందజేయాలని వివరించారు. భూమికి సంబంధించిన పత్రాలు ఉంటే రాత్రిపూట దున్నడమేంటి రాత్రి పూట చెట్లు పెట్టడం ఏంటని ఆరోపించారు. ఇప్పటికే గ్రామంలోని 377 సర్వే నంబర్ లో 360 ఎకరాల భూమి ప్రభుత్వం అధినం చేసుకుందని మిగిలిన భూమి ఇలాంటి భూకబ్జాదారుల చేతిలోకి వెళ్తుందని, గ్రామంలో పశువులు మేకలు మేయడానికి ఉపయోగపడుతుందని అనుకున్నామన్నారు. గ్రామానికి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని క్రీడా ప్రాంగణానికి అందజేయాలని కోరారు.