calender_icon.png 22 January, 2026 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర మున్సిపల్ ముఖ్య కార్యదర్శికి పిర్యాదు

22-01-2026 05:32:06 PM

అచ్చంపేట, జనవరి 22: అక్రమ పద్ధతిలో అనుమతి మంజూరు చేసిన మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గురువారం ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణానికి చెందిన పి రాజమ్మ నాగర్కర్నూల్ కలెక్టరేట్లో ఈ నెల 5వ తేదీన ప్రజావాణిలో భూభదలాయింపు ఆపాలని కోరుతూ నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కు ఫిర్యాదు చేశారు. కానీ వారికి సరైన స్పందన రాకపోవడంతో గురువారం రాష్ట్ర సచివాలయంలోని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శికి పిర్యాదు చేశారు.

బాధితు తెలిపిన వివరాల ప్రకారం అచ్చంపేట పట్టణలోని సర్వే నెం.163/163/ (Al) లోనీ తమ తల్లి  శివరాణి బాయికి చెందిన 1.25 ఎకరాల భూమికి సంబందించిన బాగాపరిష్కారం స్వాధీనం/ టైటిల్ కొరకు కూతర్లమైన అన్నపూర్ణ, రాజమ్మ, సత్యమ్మ, సుందరిబాయి, శోభ, శారద లు కలిసి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, నాగర్కర్నూల్ సూట్ 1.A No. 199/2025 IN OS NO:16/2025 కేసు వేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం కేసు పెండింగ్లో ఉండగా కోర్టు నుంచి స్టేటస్ కో ఆర్డర్ అమల్లో ఉన్నాయి. దేని గురించి ఇప్పటికే మున్సిపల్ కమీషనర్ డి. మురళి, టౌన్ ప్లానింగ్ అధికారి మనోజలకు వివరాలను తెలియజేస్తూ లిఖితపూర్వకంగా తెలియజేశారు.

అలాగే తమ భూమికి సంబంధించిన లేఔట్ పర్మిషన్ ఇవ్వకూడదని మొరపెట్టుకున్నా వినకుండా వినోద్ ప్రసాద్ ఆండ్ బ్రదర్స్కు లేఔట్ అనుమతి ఇచ్చి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్నొన్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికి అచ్చంపేట మున్సిపల్ అధికారులు అక్రమంగా లేఔట్ అనుమతి మంజూరు చేశారని తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత నాగర్ కర్నూల్ ప్రజావాణి అధికారులకు లిఖిత పూర్వకంగా ఇచ్చినా ఎలాంటి స్పందన లేదని తెలిపారు. రాష్ట్ర ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సానుకూలంగా స్పందించారని బాధితులు మీడియాతో తెలిపారు.