calender_icon.png 22 January, 2026 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

22-01-2026 05:33:26 PM

కాకతీయ యూనివర్సిటీ,జనవరి 22(విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయం మహిళ ఇంజనీరింగ్ కళాశాల లో ప్రతి ఏటా జనవరి మొదటి శనివారం నిర్వహించుతున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర కె. బిక్షాలు తెలిపారు. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా విశ్వవిద్యాలయం ఉపకులపతి కె. ప్రతాప్ రెడ్డి, రిజిస్టర్ వల్లూరి రామచంద్రం పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తమ జూనియర్ విద్యార్థినిలకు దిశ నిర్దేశాలను చేస్తారు. పూర్వ విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఎలా సాధించాలి ఏదైనా కంపెనీలో ప్లేస్మెంట్ కి ఎలా ప్రిపరేషన్ కావాలి అనే దానిపై, ప్రస్తుత నడుస్తున్న ట్రెండ్ గ్రూపుల గూర్చి కులక్షంగా వివరిస్తారు.

అంతే కాకుండా వారి యొక్క అనుభవాలను కూడా వివరిస్తారు. ఈ సమ్మేళనం ఇంజనీరింగ్ కళాశాల ప్రారం నుండి ఆనవాయితీగా వస్తున్నదని ప్రిన్సిపాల్ తెలిపారు. సమ్మేళన కన్వీనర్ పి.వి. వైష్ణవి, డీన్ స్టూడెంట్స్ ఎఫైర్స్ ఎమ్. ఇస్తారి, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ఎమ్. సదానందం, అకాడమీ కోఆర్డినేటర్స్ డాక్టర్ టి. అర్చన, ఎమ్. వేణుగోపాల్ రెడ్డి పాల్గొంటారని ఈ సమ్మేళనానికి విద్యార్థులు, బోధన, బోధ నేతర ఉద్యోగులు అందరూ మహిళ ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ హాల్ కి ఉదయం 10 గంటలకి హాజరు అవ్వాలని డాక్టర్ కె. బిక్షాలు కోరారు కోరారు.