22 June, 2026 | 1:18 AM

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం

22-06-2026 12:00 AM

దస్తగిరి పీఠం సిద్దేశ్వర స్వామి 

జహీరాబాద్, జూన్ 21: యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి మహా మండలేశ్వర్ సిద్దేశ్వర నందగిరి మహారాజ్ అన్నారు. ఆదివారం ప్రపంచ యోగ దినోత్సవం పురస్కరించుకొని ఆశ్రమంలో వైదిక పాఠశాల విద్యార్థులచే యోగాభ్యాసం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిద్దేశ్వరానందగిరి మహారాజ్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ప్రతిరోజు యోగాసనాలు వేయడం ద్వారా వివిధ రుగ్మతలు ఆ వ్యక్తికి చేరకుండా ఉంటాయని అన్నారు. యోగా ద్వారా మానసిక ఉల్లాసమే కాకుండా జ్ఞాపకశక్తి పెరిగి అనేక విషయాల్లో క్షుణ్ణంగా తెలుసుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఈ యోగ కార్యక్రమంలో సిద్దేశ్వర నందగిరి మహారాజుతో పాటు ఆశ్రమ వేదభ్యాసం నిర్వహిస్తున్న విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.