22 June, 2026 | 12:52 AM

పేదలకు అండగా ఎమ్మెల్యే

22-06-2026 12:00 AM

బాధిత కుటుంబానికి పుస్తె మట్టెలు అందజేత

తాడ్వాయి, జూన్ 21 (విజయ క్రాంతి): పేద కుటుంబాలకు అండగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు నిలుస్తున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మం డలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బొంది శివరాజు తన కుమార్తె వివాహానికి ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె మదన్మోహన్ స్పందించి ఆయన కుమార్తె వివాహానికి పుస్తే మట్టెలు పంపించారు.ఈ పుస్తే మట్టిలను  తాడ్వాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబానికి అందించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పా ర్టీ నాయకులు మాట్లాడుతూ... ప్రజల కష్టసుఖాల్లో ఎమ్మెల్యే భాగస్వామిగా ఉంటూ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తూ ఎమ్మెల్యే అండగా నిలుస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారి సంజీవులు, నాయకులు గైని శివాజీ, ప్రతాప్ రెడ్డి, రామచంద్రం, సుధాకర్ రావు, రాజు తదితరులు పాల్గొన్నారు.